Tirumala : నేడు తిరుమలలో కొనసాగుతున్న రద్దీ... ఎంత సమయం అంటే?

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎంతమాత్రం తగ్గడం లేదు

Update: 2024-10-02 04:19 GMT

tirumala darshan

తిరుమలలో నేడు కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. బుధవారం అయినా భక్తుల రద్దీ ఎంతమాత్రం తగ్గడం లేదు. నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానుండటం, దసరా సెలవులు మంజూరు కావడంతో తిరుమల తిరుపతి శ్రీవెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు ప్రజలు తిరుమలకు చేరుకుంటున్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్వామి వారిని దర్శించుకునేందుకు ముందుగానే భక్తులు ఇతర రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. మాడ వీధుల్లో తిరగాడే స్వామివారిని కనులారా వీక్షించే అవకాశముంది. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు పూర్తి చేశారు. స్వామి వారి ఆలయంలో రేపటి నుంచి రద్దీ మరింత పెరిగే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగినట్లుగా ఏర్పాట్లను చేస్తున్నారు.

హుండీ ఆదాయం...
ఈరోజు తిరుమలలోని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని పదహారు కంపార్ట్‌మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. ఉచిత దర్శనం క్యూ లైన్ లోకి టోకెన్లు లేకుండా ప్రవేశించే భక్తులకు స్వామి వారి దర్శనం పన్నెండు గంటల్లో పూర్తవుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు. టైమ్ స్లాట్ దర్శనం కోసం టోకెన్లు తీసుకున్న భక్తులకు శ్రీవారి దర్శనం నాలుగు గంటల్లో పూర్తవుతుంది. మూడు వందల రూపాయల ప్రత్యేక దర్శనం కొనుగోలు చేసిన భక్తులకు శ్రీవారి దర్శనం మూడు నుంచి నాలుగు గంటల సమయంలో పూర్తవుతుంది. నిన్న తిరుమల శ్రీవారిని 69,300 మంది భక్తులు దర్శించకున్నారని టీటీడీ తెలిపింది. వీరిలో 21,884 మంది భక్తులు తమ తలనీలాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం 4.23 కోట్ల రూపాయలు వచ్చిందని టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది.


Tags:    

Similar News