కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర .. అంబటి ఫైర్

చంద్రబాబు ఏరోజయినా ప్రజల ముందుకు వెళ్లి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు

Update: 2022-10-01 08:07 GMT

చంద్రబాబు ఏరోజు అయినా ప్రజల ముందుకు వెళ్లి తాను ఇచ్చిన హామీలను నెరవేర్చామని చెప్పారా? అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. చంద్రబాబు ఏ హామీ అమలు చేయరని, అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన హామీలను ఆయన పక్క పెట్టేస్తారన్నారు. ఈ విషయం మాత్రం ఆయన అనుకూల మీడియా రాయదన్నారు. ఏ పథకాలను అయినా అమలు చేస్తేనే కదా? చంద్రబాబు ప్రజల ముందుకు వెళ్లేది అని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం మేనిఫేస్టోలో పెట్టిన 95 శాతానికి పైగా హామీలను అమలు చేశామని చెప్పారు. అమరావతిని అభివృద్ధి చేస్తే చంద్రబాబు, ఆయన బినామీలు లబ్ది పొందాలని చూస్తున్నారన్నారు. తమ విధానం వికేంద్రీకరణ అని తొలి నుంచి చెబుతున్నామని ఆయన అన్నారు. దేవుడిని అడ్డం పెట్టుకుని కొందరు పాదయాత్ర పేరుతో మాయనాటకాలాడుతున్నారన్నారు. రైతుల పాదయాత్ర కాదని, కొవ్వెక్కిన కోటీశ్వరుల పాదయాత్ర అని అంబటి రాంబాబు అన్నారు. పాదయాత్రలో ఎవరైనా ఒక్కరైనా రైతు ఉన్నారా? అని ఆయన ప్రశ్నించారు.

గడప గడపకు ప్రభుత్వం...
గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమానికి మంచి స్పందన వస్తుందన్నారు. తాము అమలు చేసిన పథకాలను ప్రజలకు వివరిస్తున్నామని తెలిపారు. తమ పై ఎల్లో మీడియా దుష్ప్రచారం చేయడం మానుకోవాలన్నారు. పోలవరం పూర్తి కాదని, రాష్ట్రం మరో శ్రీలంకలా మారుతుందని మాత్రం చంద్రబాబు అనుకూల మీడియా రాస్తుందని అంబటి రాంబాబు అన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఈ ప్రభుత్వానికి మించి జవాబుదారీతనం లేదన్నారు. పోలవరం ఉమ్మడి సర్వేకు పట్టు అని మాత్రం రాస్తారని, భద్రాచలానికి ముప్పులేదన్న విషయాన్ని మాత్రం ఎక్కడా వారి పత్రికల్లో ప్రస్తావించరని రాంబాబు ఫైర్ అయ్యారు. పోలవరంపై అన్ని శాఖలు క్లియరెన్స్ ఇచ్చాయన్నారు. మూడు రాష్ట్రాల సందేహాలను మాత్రమే కేంద్రం తీరుస్తుందన్నారు.


Tags:    

Similar News