కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు

కర్నూలు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలు భయాందోళనలకు గురి చేశాయి. ప్రజలు భయాందోళనలకు గురయ్యారు;

Update: 2023-03-07 06:08 GMT
కర్నూలు జిల్లాలో భూప్రకంపనలు
  • whatsapp icon

కర్నూలు జిల్లాలో మరోసారి భూప్రకంపనలు ప్రజలు భయాందోళనలకు గురి చేశాయి. కర్నూలు జిల్లా తుగ్గలి మండలం రాతనలో భూమి కంపించడంతో ప్రజలు భయకంపితులయ్యారు. ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి ఇళ్లతో పాటు రోడ్లు కూడా బీటలు వారాయి. దీంతో గ్రామస్థులు బిక్కు బిక్కుమంటూ బతుకుతున్నారు. గ్రామంలోని సిమెంట్ రోడ్డలకు కూడా స్వల్పంగా బీటలు వారాయి.

గ్రామాన్ని సందర్శించి...
ీదీంతో శాసనసభ్యురాలు శ్రీదేవి ఉన్నతాధికారులతో కలసి గ్రామాన్ని సందర్శించారు. అయితే ప్రాణ నష్టం జరగకపోవడంపై అందరూ ఊపిరిపీల్చుకున్నారు. ఆస్తినష్టం పెద్దగా జరగకపోయినా ఇంటి గోడలు బీటలు వారడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పెద్దగా భయపడాల్సిన పనిలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు గ్రామస్థులకు నచ్చ చెప్పాల్సి వచ్చింది.


Tags:    

Similar News