Ap Elections Campaign: ముగిసిన ఎన్నికల ప్రచారం మూగబోయిన మైకులు
ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. కొద్ది వారాలుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఆగిపోయింది
ఎన్నికల ప్రచారం ముగిసింది. మైకులు మూగబోయాయి. గత కొద్ది వారాలుగా జరుగుతున్న ఎన్నికల ప్రచారం ఆగిపోయింది. ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు పోలింగ్ కు 48 గంటల ముందు ఎన్నికల ప్రచారాన్ని నిలిపేయాల్సి ఉంటుంది. దీంతో ఈరోజు ఆరు గంటల తర్వాత ఎలాంటి రోడ్ షోలు, బహిరంగ సభలను నిర్వహించకూడదు. దీంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ఇక పోలింగ్ పై అన్ని పార్టీల నేతలు దృష్టి పెట్టనున్నారు. తమకు ఖచ్చితంగా ఓట్లు వేసే వారిని పోలింగ్ కేంద్రాలకు తరలించడమే అసలైన సమస్య. డోర్ టు డోర్ ప్రచారాన్ని మాత్రం నిర్వహించుకునే వీలుంది.
నగదు పంపిణీ...
దీంతో పాటు ఈ రెండు రోజులు పెద్దయెత్తున నగదు పంపిణీ జరుగుతుందని సమాచారం. ఆంధ్రప్రదేశ్ లో అనేక నియోజకవర్గాల్లో ఓటుకు మూడు నుంచి నాలుగు వేల రూపాయల వరకూ ఇస్తున్నారని తెలిసింది. ఆర్థికంగా బలమైన అభ్యర్థులున్న చోట ఓటుకు నాలుగు వేల రూపాయల వరకూ ఇచ్చేందుకు అభ్యర్థులు వెనకాడటం లేదు.ఈ ఎన్నికను ఇటు అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో నగదు పంపిణీ ఏపీలో గతంలో ఎన్నడూ లేని విధంగా జరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. అయితే ఎవరు డబ్బులిచ్చినా కాదనకుండా ఓటర్లు తీసుకుంటున్నారు. చివరకు ఎవరికి ఓటు వేస్తారన్నది మాత్రం జూన్ 4వ తేదీన తేలనుంది.