Ap Elections : ఏపీలో తొలి ఫలితం వచ్చే నియోజకవర్గం ఏదో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది

Update: 2024-05-28 04:16 GMT

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు ముగిశాయి. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. జూన్ 4వ తేదీ ఉదయం ఎనిమిది గంటల నుంచి పోస్టల్ బ్యాలట్లను లెక్కిస్తారు. తర్వాత 8.30 గంటల నుంచి ఈవీఎంల లెక్కింపు ప్రారంభమవుతుంది. తొలి ఫలితం కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గం వచ్చే అవకాశముందని తెలిసింది. లేకుంటే మచిలీపట్నం, పామర్రు నియోజకవర్గం నుంచి కూడా తొలి ఫలితం వెల్లడయ్యే అవకాశముందని అధికారులు తెలిపారు.

లెక్కింపు ప్రారంభమయిన తర్వాత...
టేబుళ్ల ప్రకారం ఈవీఎంలను లెక్కిస్తారు. అయితే తక్కువ పోలింగ్ శాతం పూర్తవడంతో పాటు ఎక్కువ టేబుళ్లున్న నియోజకవర్గాల ఫలితమే తొలిసారి వచ్చే అవకాశముంది. ట్రెండ్ ఉదయం 8.30 గంటల నుంచి ప్రారంభమయినా తొలి ఫలితం మాత్రం కృష్ణా జిల్లాలోని నందిగామ, మచిలీపట్నం, పామర్రు నియోజవర్గాల నుంచే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం ఫలితం కూడా వెంటనే వచ్చే అవకాశముందంటున్నారు.


Tags:    

Similar News