విచారణ జరుగుతోంది.. త్వరలోనే రోజా అరెస్ట్: రవి నాయుడు

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన;

Update: 2025-04-06 02:47 GMT
విచారణ జరుగుతోంది.. త్వరలోనే రోజా అరెస్ట్: రవి నాయుడు
  • whatsapp icon

వైసీపీ నేత, నగరి ఎమ్మెల్యే రోజా పర్యాటక, క్రీడా శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన సమయంలో పెద్ద ఎత్తున అవినీతి, అక్రమాలు జరిగాయని తెలుగు దేశం పార్టీ నాయకులు ఎప్పటి నుండో ఆరోపిస్తూ వచ్చారు. శాప్ ఛైర్మన్ రవి నాయుడు పలు సందర్భాల్లో రోజా అరెస్ట్ తప్పదంటూ వ్యాఖ్యలు చేశారు. తాజాగా కూడా విచారణ జరుపుతూ ఉన్నామని, ఆమె అరెస్ట్ తప్పదని హెచ్చరించారు. మంత్రిగా పనిచేసిన కాలంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని పేద క్రీడాకారుల డబ్బులను కాజేశారని విమర్శించారు. నిరుపేద క్రీడాకారులకు చెందిన కోట్ల రూపాయలను రోజా దోచుకున్నారని ఆరోపించారు. ఆమె అవినీతిపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతోందని తెలిపారు. చెన్నైలో ఉండే రోజాకు ఇక్కడి అభివృద్ధి, సంక్షేమం గురించి ఏమి తెలుసునని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


Tags:    

Similar News