ఏపీలో బార్ల కోసం మరో నోటిఫికేషన్

ఆంధ్రప్రదేశ్ లో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది.

Update: 2024-12-17 06:33 GMT

ఆంధ్రప్రదేశ్ లో 53 బార్ల వేలం కోసం ఎక్సైజ్‌శాఖ రీనోటిఫికేషన్ విడుదల చేసింది. నేటి నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఈ నెల 22వరకు దరఖాస్తులు సమర్పించేందుకు గడువుగా నిర్ణయించారు. ఈ నెల 23న దరఖాస్తులను పరిశీలించనున్నారు. ఈ నెల 24న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ వేలం నిర్వహిస్తారు.


ఎంపికైన వారికి...

ఎంపికైన వారికి అధికారులు లైసెన్సులు జారీ చేయనున్నారు. ఆమధ్య బార్ల కోసం లైసెన్సులు మంజూరు చేయాలని నోటిఫికేషన్ జారీ చేసినా కొన్ని చోట్ల పెద్దగా స్పందన రాకపోవడంతో తిరిగి రీ నోటిఫికేషన్ ను ఎక్సైజ్ శాఖ విడుదల చేసింది. ఈసారైనాఎవరైనా ముందుకు వచ్చి బార్ల లైసెన్సుల కోసం దరఖాస్తులు చేసుకుంటారో? లేదో చూడాలి.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Download The App నౌ



Tags:    

Similar News