నీ బాబాయ్ ఎక్కడ లోకేష్...?

ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తుంటే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు.

Update: 2023-02-04 12:02 GMT

ఎన్టీఆర్ వారసులు రాజకీయాల్లోకి వస్తుంటే గుండెపోట్లు ఎందుకు వస్తున్నాయని మాజీ మంత్రి కొడాలి నాని ప్రశ్నించారు. యాక్సిడెంట్లు ఎందుకు అవుతున్నాయని నిలదీశారు. పాదయాత్రలో నారా లోకేష్ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. ఎమ్మెల్యేగా గెలవలేని దద్దమ్మ జగన్ ను విమర్శించడమేంటన్నారు. రోజుకు పది కిలోమీటర్లు కూడా నడవలేని లోకేష్ ప్రభుత్వాన్ని మాత్రం విమర్శిస్తున్నాడని కొడాలి నాని ఫైర్ అయ్యారు. తాను పాదయాత్ర చేయలేక లోకేష్ ను రోడ్డుపైకి చంద్రబాబు పంపారని ఆయన ఎద్దేవా చేశారు.

ఖాళీ కుర్చీలకు...
లోకేష్ ఖాళీ కుర్చీలకు ప్రసంగాలు చెబుతున్నారని సెటైర్ వేశారు. చేతకాని మాటలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. చంద్రబాబు కడుపున తప్పు పుట్టిన లోకేష్ జనాలను తన మాటలతో చంపుతున్నాడన్నారు. చంద్రబాబు, పవన్ పొలిటికల్ టూరిస్టుల్లాగా ఆంధ్రప్రదేశ్ కు వలస వస్తున్నారని అన్నారు. బాబాయ్.. గొడ్డలి పోటు అంటూ విమర్శలు చేస్తున్న లోకేష్ తన బాబాయ్ గురించి జనాలకు చెప్పాలన్నారు. నారా రామ్మూర్తి నాయుడు ఏమయ్యాడో ప్రజలకు తెలియజెప్పాలని ఆయన కోరారు. వివేకాహత్య జరిగినప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్నారని, అప్పుడు ఆయన ఫోన్ కాల్స్ పై కూడా విచారణ జరపాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. జగన్ పై బురద జల్లే ప్రయత్నాలు చంద్రబాబుతో పాటు ఎల్లోమీడియా ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుందన్నారు.


Tags:    

Similar News