త్వరలోనే నీ మీద సినిమా విడుదలవుతుంది

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదెర్తి ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు;

Update: 2022-03-20 12:31 GMT
paritala sunitha, ex minister, topuderthi prakash reddy, mla, raptadu
  • whatsapp icon

రాప్తాడు ఎమ్మెల్యే తోపుదెర్తి ప్రకాష్ రెడ్డిపై మాజీ మంత్రి పరిటాల సునీత సంచలన కామెంట్స్ చేశారు. శ్రీరాములయ్య సినిమా షూటింగ్ సమయంలో కారు బాంబు పెట్టించింది తోపుదుర్తి అని సునీత అన్నారు. ఆరోజు 26 మందిని చంపడంలో ప్రకాష్ రెడ్డి కూడా భాగస్థుడని సునీతమ్మ ఫైర్ అయ్యారు.

చరిత్ర తెలుసుకుంటే....?
ప్రకాష్ రెడ్డి తన చరిత్ర తెలుసుకుంటే మంచిదని ఆమె వ్యాఖ్యానించారు. ఆయన అవినీతిపై త్వరలోనే సినిమా విడుదల అవుతుందని కూడా పరిటాల సునీత చెప్పారు. ఈ ప్రాంతంలో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలని ఆమె సవాల్ విసిరారు. తమ కుటుంబంపై విమర్శలను పక్కన పెట్టి నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సునీత హితవు పలికారు.


Tags:    

Similar News