కమ్మ, కాపులు ఒకేటనట.. పవన్ ప్రయత్నం అదే

అరవై శాతం మంది కాపులు వైఎస్ జగన్ వెంట ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు

Update: 2023-03-15 06:13 GMT

అరవై శాతం మంది కాపులు వైఎస్ జగన్ వెంట ఉన్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ చంద్రబాబుకు దమ్ములేక పవన్ వెంట పడుతున్నారన్నారు. నిన్న పవన్ కల్యాణ్ మచిలీపట్నంలో జరిగిన సభలో చంద్రబాబుతో వెళతానని స్పష్టం చేశాడన్నారు. మరోసారి కాపులకు చంద్రబాబు వద్ద తాకట్టు పెట్టాడన్నారు. చంద్రబాబు మేలు కోసమే పవన్ రాజీకీయాలు చేస్తున్నారన్నారు. 2014లో చంద్రబాబు వద్ద కాపుకులాన్ని తాకట్టు పెట్టిన పవన్ మరోసారి అదే పనికి సిద్ధమయ్యారన్నారు.

మరోసారి చంద్రబాబుకు...
పవన్ పదేళ్ల నుంచి రాజకీయాలు చేస్తూనే తాను రాజకీయాలకు కొత్త అని అంటున్నారని ఎద్దేవా చేశారు. మరోసారి ఆవిర్భావ సభ ద్వారా పవన్ కాపులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కాపు కులాన్నే నమ్ముకుని పవన్ ఈ ఎన్నికల బరిలోకి దిగుతున్నారన్నారు. చంద్రబాబుతో లోపాయి కారీ ఒప్పందం చేసుకుని పవన్ రాజకీయాలు చేస్తున్నారన్నారు. పవన్ వ్యాఖ్యలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. కాపులు, కమ్మలు ఒక్కటేనని పవన్ నిన్నటి సభ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారని అన్నారు. బీజేపీని వదిలేయడానికి భయమని, మోదీ, అమిత్ షాలు మంచివాళ్లేనట, కానీ రాష్ట్ర బీజేపీ నేతలు మాత్రం పనికి రారని చెబుతున్నారని పవన్ అన్నారు. బీజేపీని వదిలే ప్రయత్నంలో పవన్ ఉన్నట్లు కనపడుతుందని పేర్నొ నేని అన్నారు.


Tags:    

Similar News