బాబూ... ఈ కాంతారావు డైలాగులేమిటో?
చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు
చంద్రబాబుకు మతి భ్రమించి మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. ప్రజలకు వచ్చే ఎన్నికలు చివరి అవకాశమని చెప్పడమేంటని ఆయన ఎద్దేవా చేశారు. ఇదేం ఖర్మరా బాబూ అంటూ చంద్రబాబును చూసి జనం నవ్వుకుంటున్నారన్నారు. ఉప్పు, పప్పు, నూనెల ధరలు పెరిగిపోయాయని జనం బాదుడే బాదుడే కార్యక్రమాంలో అనుకుంటున్నారని చంద్రబాబు అంటున్నారని, హెరిటేజ్ లో ధరలు ఎలా ఉన్నాయో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు. రామోజీ సంస్థలు విక్రయించే ప్రియా నూనె ధర ఎంత ఉందని పేర్ని నాని ప్రశ్నించారు.
ప్రజలకు చివరి అవకాశమేంటో?
జనం తిరగబడే బాదే పరిస్థిితి వచ్చిందని పేర్ని నాని అన్నారు. కాంతారావు డైలాగ్ లా తనను, తన కొడుకును చంపాలని వైసీపీ ప్రయత్నిస్తున్నారని, జనంలో సానుభూతి పెంచుకునేందుకు పాకులాడుతున్నారని అన్నారు. మల్లెల బాబ్జీ నాటి కాలం ఇది కాదన్నారు. ఈ డ్రామాలను ప్రజలు నమ్మరని అన్నారు. ఆయనను చంపేందుకు ఎవరూ ఇక్కడ కుట్రలు చేయాల్సిన అవసరం లేదని, రాజకీయంగా ఎప్పుడో హత్య చేశామని ఆయన అన్నారు. ఎప్పటికీ అధికారంలోకి రాలేనని కుంగిపోవడానికే నాడు వెంకటేశ్వరస్వామి అలిపిరి ఘటనలో బతికించి ఉంటాడని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ శాపం ఊరికే పోదన్నారు. 2024 తర్వాత ఎన్టీఆర్ పగ తీర్చుకోపోతున్నారని పేర్ని నాని అన్నారు. చంద్రబాబు ను చంపాల్సిన అవసరం ఎవరికి ఉంటుందని అన్నారు. సత్తుకేసు సాంబయ్య 150 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉండాలని బఠాని గింజంత మెదడున్న ఏ రాజకీయ నాయకుడైనా కోరుకుంటారని పేర్ని నాని అన్నారు.