నారా లోకేశ్ పాదయాత్రకు బ్రేక్

నాలుగు రోజుల పాటు పాదయాత్రను నిలిపివేయనున్నారు. ఆయన పాదయాత్రకు బ్రేక్ పడటానికి కారణం ..

Update: 2023-05-25 10:40 GMT

break for yuvagalam padayatra

టీడీపీ నాయకుడు నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. నాలుగు రోజుల పాటు పాదయాత్రను నిలిపివేయనున్నారు. ఆయన పాదయాత్రకు బ్రేక్ పడటానికి కారణం మహానాడు. మే 27,28 తేదీలలో రాజమండ్రిలో టీడీపీ ఆధ్వర్యంలో మహానాడు కార్యక్రమం జరగనుంది. ఈ నేపథ్యంలో లోకేశ్ పాదయాత్రకు తాత్కాలిక విరామం ప్రకటించారు. 26 నుండి 29 వరకూ పాదయాత్ర నిలిచిపోనుంది. తిరిగి మే 30వ తేదీ నుండి యువగళం పాదయాత్ర పునః ప్రారంభం కానుంది.

కాగా.. ఈ రోజు జమ్మలమడుగులో లోకేశ్ పాదయాత్రను ముగించారు. జమ్ములమడుగు నియోజకవర్గంలోని పెద్దముడియం, పెద్దపసుపుల గ్రామాల మీదుగా లోకేశ్ పాదయాత్ర కొనసాగింది. ఈ పాదయాత్రలో లోకేశ్ కు స్థానిక ప్రజలు ఘనస్వాగతం పలికారు. అనంతరం అక్కడి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుండి ఆయన కడప ఎయిర్ పోర్టుకు వెళ్లి.. ప్రత్యేక విమానంలో అమరావతికి బయల్దేరారు. రేపు (మే26) అమరావతి నుంచి రాజమండ్రిలో మహానాడు జరిగే ప్రాంతానికి లోకేష్ బయల్దేరనున్నారు.


Tags:    

Similar News