గోరంట్ల రిజల్ట్ ఇంకా రాలేదు

గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వీడియో పై రిజల్ట్ రాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు

Update: 2022-08-08 12:44 GMT

గోరంట్ల మాధవ్ కు సంబంధించిన వీడియో పై రిజల్ట్ రాలేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. మార్ఫింగ్ కాదని తేలితే ఆయనపై చర్యలు తప్పవని తెలిపారు. ఫోరెన్సిక్ నుంచి ఇంకా నివేదిక అందలేదని తెలిపారు. నాలుగు గోడల మధ్య జరిగిన ఒక విషయం బయటకు వచ్చిందని, ఒరిజినల్ బయటకు రాలేదని అన్నారు. గతంలో ఓటుకు నోటు కేసులో చంద్రబాబు వాయిస్ విషయంలోనూ ఫోరెన్సిక్ నివేదిక ఏడేళ్లవుతున్నా ఇంత వరకూ బయటకు రాలేదన్నారు. ఎంపీ విషయంలో అవతలి వైపు నుంచి ఫిర్యాదు లేదని సజ్జల తెలిపారు. ఎంపీ విషయం కంటే చంద్రబాబు ఓటుకు నోటు కేసు పెద్దదన్నారు. ఎంపీ

ఇదేం ప్రచారం....
చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఒక మీటింగ్ లో పాల్గొనగానే ఎల్లో మీడియా విస్తృతంగా ప్రచారం చేసిందన్నారు. మోదీ తరచూ చంద్రబాబును ఢిల్లీకి రావాలని కోరినట్లు డబ్బా కొట్టుకుంటుందన్నారు. మోదీ పలకరించిన వెంటనే దానిని చిలవలు పలవలుగా చేసి చేస్తున్న ప్రచారాన్ని ప్రజలు ఏవగించుకుంటున్నారని సజ్జల అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో తమ పార్టీ ఓటు బ్యాంకును బీజేపీకి అనుకూలంగా మలుస్తానని మాట ఇచ్చి వచ్చారని కూడా ఢిల్లీలో కూడా ప్రచారం జరుగుతుందని ఆయన తెలిపారు. 2014లో టీడీపీ బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకుందని, అనంతరం 2019 ఎన్నికలకు వచ్చే సరికి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి విడిగా పోటీ చేశారన్నారు. మళ్లీ ఇప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండేందుకు అందరూ ఒక్కటవ్వాలని ప్రయత్నిస్తున్నారని సజ్జల అన్నారు. చంద్రబాబు పాత ఎత్తుగడలనే నమ్ముకుంటున్నారని ఆయన అన్నారు.
పిల్లిమొగ్గలు వేసేందుకు...
చంద్రబాబు మానసిక పరిస్థితి బాగాలేదని, ఆయన హెల్త్ చెకప్ చేయించుకోవాల్సిన అవసరం ఉందని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని తాము ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. చంద్రబాబు ఢిల్లీ టూర్ పై అనేక అనుమానాలు ఉన్నాయిన్నారు. వెంటిలేటర్ పై ఉన్న టీడీపీ ఊతకర్ర కోసం ఎదురు చూస్తుందని తెలిపారు. ఎన్ని పగటి కలలు కన్నా చంద్రబాబు ప్రయత్నాలు ఫలించవని సజ్జల అన్నారు. బీజేపీతో లోపాయికారీ ఒప్పందానికి చంద్రబాబు ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ప్రజలు విశ్వసించలేనంత కాలం టీడీపీ గెలవదని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీకి సాయం చేస్తే ఏపీలో బీజేపీ టీడీపీకి సాయం చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారన్న ప్రచారం జరుగుతుందని తెలిపారు.


Tags:    

Similar News