Andhra Pradesh : నేటి నుంచి ఏపీలో టెన్త్ పరీక్షలు.. ఏర్పాట్లు పూర్తి
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి.;

ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు నుంచి ఏప్రిల్ 1వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకూ పరీక్ష జరగనుంది. పరీక్ష ప్రారంభమయ్యే వరకూ పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించనున్నారు. ఇందుకోసం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.
పరీక్ష కేంద్రాల వద్ద...
ఈ పదోతరగతి పరీక్షల్లో మొత్తం 6,19,275 మంది విద్యార్థులు హాజరు కానున్నారని ప్రాధమిక విద్యాశాఖ అధికారులు తెలిపారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా ముప్ఫయి స్వ్కాడ్ లను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ విధించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఉన్న జిరాక్స్ సెంటర్లు, నెట్ సెంటర్లు మూసివేయాలని ఆదేశించారు. పదోతరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తమ ఇంటి నుంచి పరీక్ష కేంద్రానికి వెళ్లేందుకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేయనున్నారు.