Chandrababu : 18న ఢిల్లీకి చంద్రబాబు నాయుడు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు;

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 18న ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు. అమరావతి రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి పనులు ప్రారంభించేందుకు రావాలని ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే రాజధాని అమరావతి నిర్మాణ పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఆయన చేత శంకుస్థాపనలు చేయించాలని చంద్రబాబు భావిస్తున్నారు. దీంతో స్వయంగా ప్రధానిని కలసి రాజధాని పనులకు తమ చేతులమీదుగా ప్రారంభించాలని కోరనున్నారు.
అమరావతి పనులకు...
అయితే అనధికారికంగా ఇప్పటికే వచ్చే నెల 19న ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటన ఖరారయినట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన పర్యటన కేవలం ఆహ్వానం పలుకేందుకేనని తెలిసింది. హడ్కో నుంచి పదకొండు వేల కోట్ల రూపాయలు, ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకు ఇచ్చే పదిహేను వేల కోట్ల రూపాయల వ్యయంతో రాజధాని నిర్మాణ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంంది. ఇందుకు కార్యాచరణను కూడా రూపొందించారు. దీంతో పాటు మరికొన్ని కీలక అంశాలను ప్రధానితో చర్చించే అవకాశముంది. ఈ సందర్భంగా చంద్రబాబు పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశముంది.