మున్సిపాలిటీగా అమరావతి
రాజధాని అమరావతి పరిధిలోని 22 గ్రామాలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేసేందుకు ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది
రాజధాని అమరావతి పరిధిలోని 22 గ్రామాలతో మున్సిపాలిటీని ఏర్పాటు చేసేందుకు ఈరోజు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తుళ్లూరు, మంగళగిరి మండలాల పరిధిలోని 22 గ్రామాల్లో గ్రామసభలను నిర్వహించి ఆ యా గ్రామాల ప్రజల అభిప్రాయాలను సేకరించాలని గుంటూరు జిల్లా కలెక్టర్ కు ఏపీ పంచాయతీ, గ్రామీణాభివృద్ధి శాఖ ఆదేశాలు జారీ చేసింది. దీంతో కలెక్టర్ గ్రామాల్లో సభలకు నోటీసులు జారీ చేశారు.
గ్రామసభలు నిర్వహించి....
అయితే గతంలో ఇదే గ్రామాలను మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం రెడీ అవ్వగా గ్రామ ప్రజలు అందుకు తిరస్కరించారు. 22 గ్రామాల ప్రజలు గ్రామసభల్లో తాము కార్పొరేషన్ ఏర్పాటుకు వ్యతిరేకమని చెప్పాయి. రాజధాని ప్రాంతంలోని 29 గ్రామాలతో మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. అయతే మరోసారి కార్పొరేషన్ కాకుండా మున్సిపాలిటీని 22 గ్రామాలతో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.