తిరుపతిలోనే భక్తులు.. అనుమతించని టీటీడీ

తిరుమలలో భారీ వర్షం భక్తులను ఇబ్బంది పెడుతుంది. భారీ వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లను మూసివేశారు.

Update: 2021-11-19 02:11 GMT

తిరుమలలో భారీ వర్షం భక్తులను ఇబ్బంది పెడుతుంది. భారీ వర్షం కారణంగా తిరుమల ఘాట్ రోడ్ లను మూసివేశారు. రెండు నడక దారులను కూడా క్లోజ్ చేశారు. దీంతో భక్తులను కొండమీదకు అనుమతించడం లేదు. కొండచరియలు విరిగిపడటం, భారీ వర్షాల కారణంగా కొండపైకి ఎవరూ రావద్దని టీటీడీ ఇప్పటికే స్పష్టం చేసింది. దీంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులు తిరుపతిలోనే చిక్కుకుపోయారు.

కింద తిరుపతిలోనే....
వేల సంఖ్యలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వచ్చి తిరుపతిలో ఉండిపోయారు. వీరందరికీ టీటీడీ బస, భోజన ఏర్పాట్లు చేస్తుంది. వీరికి శ్రీనివాసం, గోవిందరాజు సత్రాల్లో బసను ఏర్పాటు చేశారు. భోజనం, టిఫిన్ వంటి సదుపాయాలను కల్పిస్తున్నారు.


Tags:    

Similar News