శ్రీవారి సన్నిధిలో కుండపోత వర్షం
భారీ వర్షాలు తిరుమలను వణికిస్తున్నాయి. తిరుమలలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి.
భారీ వర్షాలు తిరుమలను వణికిస్తున్నాయి. తిరుమలలో కొన్ని ప్రాంతాలు జలమయమయ్యాయి. తిరుమలలోని ఆర్జితం కార్యాలయంలోకి వరద నీరు ప్రవేశించడంతో సర్వర్స్ షట్ డౌన్ అయ్యాయి. దీంతో శ్రీవారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.
కొండ చరియలు విరిగిపడి....
నారాయణగిరి వంటి అతిధి గృహాలపై కొండరాళ్లు విరిగిపడ్డాయి. దీంతో భక్తులను కాటేజీల నుంచి అధికారులు ఖాళీ చేయించారు. మరో ప్రాంతానికి వారిని తరలించారు. తిరుమలలో ఇంతటి వర్షాన్ని ఎప్పుడూ చూడలేదని స్థానికులు చెబుతున్నారు. శ్రీవారి ఆలయంతో పాటు మాడవీధులు, తీరుమలలోని రహదారులు, విశ్రాంతి గదులు అన్నీ జలమయమయ్యాయి. ఇప్పటికే టీటీడీ రెండు కాలినడక దారులను మూసివేసింది.