తిరుమలలో వసతికి టీటీడీ కొత్త ఆలోచన

తిరుమలలో దైవ దర్శనం కన్నా వసతి లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని భక్తులు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు

Update: 2022-10-09 12:42 GMT

తిరుమలలో దైవ దర్శనం కన్నా వసతి లేక భక్తులు ఇక్కట్లు పడుతున్నారు. ఈ విషయాన్ని భక్తులు ఈవో ధర్మారెడ్డి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఆయన ప్రయోగాత్మకంగా తిరుమలలో వసతి గృహాల కేటాయింపును తిరుపతిలో ప్రయోగాత్మకంగా చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భాగంగా అనేక మంది భక్తులు వసతి సౌకర్యంపైనే ఎక్కువ ఫిర్యాదు చేశారు.

వీఐపీ బ్రేక్ దర్శనాలను...
తిరుపతిలోనే వసతి గదుల గృహాలను కేటాయిస్తే గదులు దొరకని భక్తులు అక్కడే వసతిని పొంది దర్శనానికి తిరుమలకు వస్తారని ఆయన అభిప్రాయపడ్డారు. త్వరలోనే ప్రయతోగాత్మకంగా ఈ విధానాన్ని ప్రవేశపెడతామని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. వీఐపీ బ్రేక్ దర్శనాలను కూడా ఉదయం పది గంటల నుంచే ప్రారంభించే యోచనలో ఉన్నామని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. రాత్రి వేళ క్యూ లైన్లలో వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరితగతిన దర్శనం కావాలంటే ఈ విధానాన్ని అమలులోకి తేవాలని భావిస్తున్నామని చెప్పారు. త్వరలో టైమ్ స్లాట్ విధానంలోనూ టోకెన్లు ఇస్తామని, దీని వల్ల తిరుపతిలోనే ఉండి తమకు కేటాయించిన సమయంలో దర్శనానికి రావచ్చని ఆయన తెలిపారు.


Tags:    

Similar News