గుడ్ న్యూస్ చెప్పిన మంత్రి నిమ్మల.. ఫ్రీ బస్సు ఎప్పటి నుంచీ అంటే?

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు మహిళలకు గుడ్ న్యూస్ చెప్పారు.;

Update: 2024-08-19 12:00 GMT
nimmala ramanaidu, irrigation minister,  good news, women
  • whatsapp icon

నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గుడ్ న్యూస్ చెప్పారు. త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తామని తెలిపారు. తర్వాత తల్లికి వందనం పథకాన్ని కూడా అమలు పరుస్తామని చెప్పారు. ఇంట్లో ఎంత మంది పిల్లలున్నా ప్రతి ఒక్కరికీ పదిహేను వేల రూపాయల చొప్పును ప్రభుత్వం ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని తెలిపారు.

తల్లికి వందనం కూడా...
మార్గదర్శకాలు విడుదలయిన తర్వాత ఎప్పటి నుంచి అన్నది దీనిపై స్పష్టత వస్తుందని నిమ్మల రామానాయుడు తెలిపారు. విపక్షం చేసే ప్రచారాన్ని నమ్మవద్దని ఆయన కోరారు. సూపర్ సిక్స్ లో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.


Tags:    

Similar News