Chandrababu : చంద్రబాబు త్వరలో గుడ్ న్యూస్ చెబుతారా? ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ అప్పటి నుంచేనా?

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలిసింది.

Update: 2024-08-11 07:55 GMT

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మహిళలకు మరో గుడ్ న్యూస్ చెప్పనున్నారని తెలిసింది. ఈ మేరకు ఆయన కసరత్తులు చేస్తున్నట్లు సమాచారం. తెలుపు రంగు రేషన్ కార్డులున్న వారికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లను పంపిణీ చేసేందుకు ఆయన సిద్ధమవుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చవుతుందన్న విషయాన్ని ఇప్పటికే పౌరసరఫరాల శాఖ అధికారులకు ఆయన ఆదేశించినట్లు తెలిసింది. ఒక సిలిండర్ మూడు నెలలు వస్తుందని, ఏడాదికి మూడు సిలిండర్లు ఎంత మందికి ఇవ్వాల్సి ఉంటుందన్న లెక్కలు వేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు చెబుతున్నారు.

అప్పటి నుంచే...
రాష్ట్రంలో 1.48 కోట్ల రేషన్ కార్డులున్నాయి. ఇందులో తెలుపు రంగు రేషన్ కార్డులు కూడా దాదాపు అరవై లక్షలకు పైగానే ఉంటాయని చెబుతున్నారు. అరవై లక్షల మంది ఇళ్లకు మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే తెలుపు రంగు రేషన కార్డులున్న వారంతా కేవైసీ చేసుకోవాలని చెప్పడంతో ఇప్పటికే గ్యాస్ కంపెనీల వద్దకు క్యూ కడుతున్నారు. ఉచిత బస్సు ప్రయాణం ఆగస్టు నెలలో ప్రారంభిస్తే, మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను సెప్టంబరు లేదా అక్టోబరు నెల నుంచి ఇవ్వాలన్న యోచనలో ఉన్నారని తెలిసింది. దసరా కానుకగా మహిళలకు మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేయాలని చంద్రబాబు దాదాపుగా నిర్ణయానికి వచ్చినట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. విపక్షం విమర్శలను తిప్పికొట్టేందుకు త్వరగానే దీనిని అమలు చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమవుతున్నారని తెలిసింది.


Tags:    

Similar News