Pawan Kalyan : పవన్ భయ్యా.... కడప సరే..తోలు తీస్తానన్నావ్... మరి కాకినాడ మాటేంటి?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవేశపరుడు. అంతకు మించి గతంలో జరిగిన ఘటనలు ఎవరికీ గుర్తుండవని భావిస్తారు.

Update: 2024-12-29 04:43 GMT

జనసేన అధినేత పవన్ కల్యాణ్ అవేశపరుడు. అంతకు మించి గతంలో జరిగిన ఘటనలు ఎవరికీ గుర్తుండవని భావిస్తారు. నిన్న కడప కు వెళ్లి రిమ్స్ లో వైసీపీ నేత దాడిలో గాయపడిన జవహర్ బాబును ఆయన పరామర్శించారు. అందులో ఏమాత్రం తప్పులేదు. ఎందుకంటే ఉప ముఖ్యమంత్రిగా అధికారుల్లో ధైర్యాన్ని భరోసాను నింపేందుకు, ప్రభుత్వ ఉద్యోగులను వారి పని వారిని చేసుకునేందుకు అవకాశం కల్పించేలా ఆయన పర్యటన సాగింది. అయితే పవన్ కల్యాణ్ తర్వాత మీడియాతో మాట్లాడుతూ 11 సీట్లు వచ్చిన వైసీపీ నేతలకు ఇంకా అహం తగ్గలేదని, తాట తీస్తానని, తోలు తీస్తానని హెచ్చరికలు జారీ చేశారు. ఇలాంటి ఘటనలను తాను ఉపేక్షించబోనని తెలిపారు.


హెచ్చరికలు చేయవచ్చు కానీ...

ఉప ముఖ్యమంత్రిగా ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయవచ్చు కానీ, సినిమా డైలాగుల మాదిరిగా తోలు వలుస్తా, తాట తీస్తా అంటూ ఇచ్చిన వార్నింగ్ సబబుగా లేదన్న కామెంట్స్ వినపడుతున్నాయి. అవసరమైతే తాను రాయలసీమలో క్యాంప్ కార్యాలయం పెడతానంటూ ఆయన రెచ్చిపోయారు. క్యాంప్ కార్యాలయం పెట్టినంత మాత్రాన ఆగుతాయా? అలాగంటే ఆయన ప్రాతినిధ్యం వహించే పిఠాపురం నియోజకవర్గంలో బాలికపై అత్యాచారం జరిగితే ఏం చేశారని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. అది కూడా పక్కన పెడితే కాకినాడ సంఘటనను కూడా ఇప్పుడు చాలా మంది సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ మరి దీని సంగతేంటి సారూ అంటూ ప్రశ్నిస్తున్నారు.
డాక్టర్ పై దాడి జరిగినప్పుడు...
కాకినాడలో రూరల్ ఎమ్మెల్యే, జనసేన నేత పంతం నానాజీ డాక్టర్‌పై ఎమ్మెల్యే చేయి ఎత్తడం, అతని అనుచరులు దాడి చేయడం దుమారం రేపింది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్‌లో జరిగిన ఈ ఘటనను పోస్ట్ చేస్తున్నారు. కాలేజీ గ్రౌండ్‌లో బయటి వ్యక్తులు వాలీబాల్‌ ఆడుతుండటంతో తమకు ఆడుకునే అవకాశం దక్కడం లేదని మెడికల్ కాలేజీ స్టూడెంట్స్ ప్రిన్సిపల్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో కళాశాల గ్రౌండ్‌లో బయటి వ్యక్తులు ఆటలు ఆడవద్దని ఆంక్షలు విధించారు. ఎమ్మెల్యే పంతం నానాజీ డాక్టర్‌ ఉమామహేశ్వరరావును తీవ్ర అసభ్య పదజాలంతో దూషించారు. ఆయన అనుచరులుదాడి చేశారు. అయితే అక్కడకు వెళ్లి డాక్టర్ ను పరామర్శించి ఎందుకు తాట తీస్తానని అనలేదంటూ పవన్ కల్యాణ్ ను వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. దాడికి గురైన ఇద్దరూ దళితులే. కానీ వేర్వేరు చోట్ల వేరేయేషన్ చూపించడమేంటి? వపన్ అని ప్రశ్నిస్తున్నారు. పంతం నానాజీపై కేసు నమోదు చేయాలని అప్పట్లో చెప్పిన విషయాన్ని, నానాజీ క్షమాపణలు చెప్పిన సంగతిని జనసేన నేతలు గుర్తుచేస్తున్నారు.

ఇప్పుడు Desh Telugu Keyboard యాప్ సహాయంతో మీ ప్రియమైన వారికి తెలుగులో సులభంగా మెసేజ్ చెయ్యండి. Desh Telugu Keyboard and Download The App నౌ 


Tags:    

Similar News