నా సహనాన్ని పరీక్షించొద్దు
వ్యక్తిగత దూషణలకు దిగి తన సహనాన్ని పరీక్షించవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు
వ్యక్తిగత దూషణలకు దిగి తన సహనాన్ని పరీక్షించవద్దని జనసేన అధినేత పవన్ కల్యాణ్ కోరారు. ఆయన పార్టీ కార్యకర్తలతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అనాలోచిత నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ ను అంధకారంలోకి నెట్టాయని పవన్ అన్నారు. తనపై వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని, రాక్షసుడు, దుర్మార్గుడు అంటూ తనను సంభోదిస్తున్నారని, అయితే తన సహనాన్ని పరీక్షించ వద్దని పవన్ కోరారు.
పీపీఏలను రద్దు చేసి....
పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లను రద్దు చేసి ప్రభుత్వం పెద్ద తప్పు చేసిందని, దాని ఫలితమే ఇప్పుడు విద్యుత్తు కోతలని పవన్ కల్యాణ్ అన్నారు. చివరకు పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించేంత వరకూ పరిస్థితి వచ్చిందన్నారు. తాను వ్యక్తిగత అజెండాతో పార్టీని స్థాపించలేదని, ప్రజల కోసమే పార్టీని పెట్టానని చెప్పారు. 2014 నుంచి 2019 వరకూ రాష్ట్రంలో విద్యుత్తు కోతలు ఎందుకు లేవో ప్రజలు ఒకసారి గ్రహించాలని పవన్ కల్యాణ్ కోరారు. ప్రజలను పల్లకి ఎక్కించేంత వరకూ తన పోరాటం కొనసాగుతుందని చెప్పారు.