Pawan Kalyan : నేడు జగన్ పరిశ్రమలను పరిశీలించనున్న పవన్

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించనున్నారు

Update: 2024-11-05 03:40 GMT

Pawan Kalyan

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నేడు పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. సరస్వతి పవర్ భూములను ఆయన పరిశీలించనున్నారు. పవన్ కల్యాణ్ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తిచేశారు. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కు చెందిన సరస్వతి పవర్ భూములపై సర్వే చేయాలని ఇప్పటికే పవన్ కల్యాణ్ ఆదేశించిన సంగతి తెలిసిందే.

అటవీ భూములున్నాయని...
ఈనేపథ్యంలో వారం రోజుల క్రితమే అధికారులు ఆ సర్వే పూర్తిచేసి నివేదికను కూడా అందించారు. ఈరోజు పవన్ కల్యాణ్ సరస్వతి పవర్ భూములను పర్యటిస్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. సరస్వతి పవర్ పరిశ్రమకు కేటాయించిన భూముల్లో 15 వందల ఎకరాల అటవీ భూములున్నయన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ పర్యటన కొంత ఆసక్తికరంగా మారింది. దీనిపై పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఉత్కంఠగా మారింది.


Tags:    

Similar News