Breaking : పవన్ కు బిగ్ రిలీఫ్... గాజు గ్లాసు గుర్తుపై

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది.;

Update: 2024-04-16 06:39 GMT
Breaking : పవన్ కు బిగ్ రిలీఫ్... గాజు గ్లాసు గుర్తుపై
  • whatsapp icon

జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఊరట లభించింది. గాజుగ్లాసు గుర్తుపై దాఖలయిన పిటీషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసింది. దీంతో పవన్ కు చాలా వరకూ ఊరట కలిగినట్లేనని చెప్పుకోవాలి. గాజు గ్లాస్ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ రాష్ట్రీయ ప్రజా  కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేసింది.

గాజుగ్లాసు గుర్తును...
గాజుగ్లాసు గుర్తును కేంద్ర ఎన్నికల కమిషన్ ఫ్రీ సింబల్ గా ప్రకటించిందని, ఆ గుర్తును తమకు కేటాయించాలని కోరుతూ దాఖలు చేసిన పిటీషన్ ను హైకోర్టు కొట్టివేయడంతో జనసేనకు ఊరట కలిగినట్లే అనుకోవాలి. అదే సమయంలో ఫ్రీ సింబల్ నుంచి దానిని తొలగించాలని ఇప్పటికే జనసేన న్యాయ నిపుణులతో చర్చిస్తుంది.


Tags:    

Similar News