క్వాష్ పిటీషన్‌పై తీర్పు మరికాసేపట్లో
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన క్వాష్ పిటీషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది
స్కిల్ డెవలెప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన క్వాష్ పిటీషన్‌పై నేడు తీర్పు వెలువడనుంది. మధ్యాహ్నం 1.30 గంటలకు తీర్పు వెలవడనుంది. ఈ స్కామ్ లో ఎటువంటి ఆధారాలు లేవని, ఆధారాలు లేకుండానే రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారని, ఆయనపై నమోదయిన కేసులను కొట్టివేయాలంటూ క్వాష్ పిటీషన్ దాఖలు చేశారు. చంద్రబాబు కారణంగానే 371 కోట్ల రూపాయల ప్రజాధనం దుర్వినియోగం జరిగిందని సీఐడీ తరుపున న్యాయవాదులు వాదించారు.
రిజర్వ్ చేయడంతో...
అన్ని ఆధారాలతోనే ఆయనను అరెస్ట్ చేశారని, ఆయన సంతకాలు కూడా అనేక చోట్ల ఉన్నాయని సీఐడీ తరుపున న్యాయవాదులు పేర్కొన్నారు. ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు క్వాష్ పిటీషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది. ఈరోజు తీర్పు వస్తుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. అయితే క్వాష్ పిటీషన్‌పై స్పష్టత వచ్చిన తర్వాతనే చంద్రబాబు సీఐడీ కస్టడీ పిటీషన్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తి తీర్పును వెలువరించనుంది. చంద్రబాబుకు అనుకూలంగా హైకోర్టులో తీర్పు వస్తే ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశాలున్నాయని న్యాయవాదులు చెబుతున్నారు. కొట్టివేస్తే మాత్రం మరికొన్ని రోజులు జైలు జీవితం తప్పదని అంటున్నారు.