వివేకా హత్య: న్యాయం కోసం ఆరు ఏళ్ల పోరాటం–వివేకా కుమార్తె సునీత
వివేక హత్యకు ఆరు సంవత్సరాలు అయినా న్యాయం జరగలేదని సునీత ఆవేదన. సీబీఐ విచారణ కొనసాగుతున్నా నిందితులు బయట తిరుగుతున్నారని విమర్శలు.;

కడప: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్యకు గాను న్యాయం కోసం పోరాడుతున్న కుమార్తె వైఎస్ సునీత రెడ్డి, తన తండ్రి 6వ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించారు. పులివెందుల సమాధుల తోటలో కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన ఆమె, న్యాయం కోసం ఆరేళ్లుగా పోరాటం కొనసాగిస్తున్నప్పటికీ విచారణ సరిగ్గా జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
సునీత మాట్లాడుతూ, హత్య కేసులో ఒక్కరు తప్ప మిగిలిన నిందితులంతా బయట స్వేచ్ఛగా తిరుగుతున్నారని, ట్రయల్స్ కూడా సరిగ్గా జరుగడం లేదని ఆరోపించారు. సాక్షులను, నిందితులను కాపాడే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, సాక్షుల మరణాలపై అనుమానాలున్నాయని తెలిపారు. తాను న్యాయం జరిగేంత వరకు పోరాడుతూనే ఉంటానని స్పష్టం చేశారు.