Mudragada : షరతులు లేకుండానే చేరిక.. అందుకేగా?

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఆయన ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరనున్నారు

Update: 2024-03-11 02:44 GMT

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరేందుకు ముహూర్తం ఖరారయింది. ఆయన ఈ నెల 14వ తేదీన వైసీపీలో చేరనున్నారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైసీపీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీలో చేరనున్నట్లు తెలిపారు. ఇప్పటికే వైసీీపీ నేతలు ముద్రగడ పద్మనాభంతో మంతనాలు జరిపిన నేపథ్యంలో ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. తొలుత జనసేనలో చేరాలనుకున్న ముద్రగడ పద్మనాభానికి ఆ పార్టీ అధినేత నుంచి సానుకూల ఆహ్వానం లభించలేదు.

14న వైసీపీలోకి...
దీంతో వైసీపీ నేతలు కిర్లంపూడికి చేరుకుని ఆయనతో చర్చలు జరిపారు. ఎలాంటి షరతులు లేకుండా వైసీపీలో చేరుతున్నట్లు ముద్రగడ పద్మనాభం తెలిపారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తాను ఏదైనా పదవిని తీసుకుంటానని చెప్పారు. ఆయన 14వ తేదీన కిర్లంపూడి నుంచి పెద్దయెత్తున ర్యాలీగా బయలుదేరి తాడేపల్లికి చేరుకోనున్నారు. ముద్రగడ పద్మనాభంతో పాటు ఆయన కుమారుడు గిరి కూడా వైసీపీలో చేరుతున్నారు. ఈ ఎన్నికల్లో మాత్రం ముద్రగడ కుటుంబం పోటీకి దూరంగానే ఉండనుంది.


Tags:    

Similar News