తండ్రి భౌతిక కాయాన్ని చూసి...?

మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమయింది. ఈరోజు ఉదయం ఆరుగంటలకే నెల్లూరు నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమయింది.;

Update: 2022-02-23 01:57 GMT
mekapati gautam reddy, funeral, krsinarjun reddy, son
  • whatsapp icon

మేకపాటి గౌతమ్ రెడ్డి అంతిమయాత్ర ప్రారంభమయింది. ఈరోజు ఉదయం ఆరుగంటలకే నెల్లూరు నుంచి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమయింది. మంత్రులు ముందు నడుస్తుండగా మేకపాటి అంతిమయాత్ర సాగుతోంది. కాగా మేకపాటి గౌతమ్ రెడ్డి కుమారుడు కృష్ణార్జున్ రెడ్డి అమెరికా నుంచి రాత్రి చేరుకున్నారు. అమెరికా నుంచి చెన్నై కు వచ్చి అక్కడి నుంచి ఆయన నెల్లూరుకు చేరుకున్నారు.

ఏకాంతంగా వదిలేయాలని....
తన తండ్రి పార్ధీవ దేహాన్ని చూసి కృష్ణార్జున్ రెడ్డి బోరున విలపించారు. ఛాంబర్ లో ఉన్న తన తండ్రి భౌతికకాయం వద్ద తాను ఏకాంతంగా గడపాలని ఆయన కోరుకున్నారు. అందరూ వెళ్లిపోవాలని కోరారు. తండ్రి భౌతిక కాయాన్ని నిమురుతూ కృష్ణార్జున్ రెడ్డి విలపించడం చూసిన వారి గుండెలు తరుక్కుపోయాయి. చాలా సేపు తండ్రి శరీరాన్ని నిమురుతూ అలాగే కూర్చుండి పోయారు. తర్వాత కుటుంబ సభ్యులు కృష్ణార్జున్ రెడ్డిని ఓదార్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు ఉదయగిరిలోని మెరిట్స్ కళాశాలలో గౌతమ్ రెడ్డి అంత్యక్రియలు ప్రారంభం కానున్నాయి.


Tags:    

Similar News