తెలుగు రాష్ట్రాలకు హెచ్చరిక
వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముంది.
వాతావరణ శాఖ రెండు తెలుగు రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. తమిళనాడు మీద ఉన్న ఉపరితల ఆవర్తనం నుంచి గంగా పరివాహక ప్రాంతం పశ్చిమ బెగాల్ వరకూ, ఆంధ్ర, ఒడిశా మీదుగా సముద్ర మట్టానిక 0.9 కిలోమీటర్ల ఎత్తు వరకూ వ్యాపించి ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది.
భారీ వర్షాలు.....
ఈ కారణంగా ఏపీ, తెలంగాణతో పాటు ఒడిశా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో పాటు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతవరణ శాఖ పేర్కొంది. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రజలను అప్రమత్తం చేశాయి. ప్రధానంగా రైతులు తమ ధాన్యాన్ని వర్షం బారిన పడకుండా కాపాడుకోవాలని సూచించాయి.