నేడు ఏపీకి వర్ష సూచన
నేడు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
నేడు ఆంధ్రప్రదేశ్‌లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు మాత్రం భారీ వర్సాలు కురిసే అవకాశముందని పేర్కొంది. విదర్భ నుండి తెలంగాణ మీదుగా దక్షిణతమిళనాడు వరకు ద్రోణి కొనసాగుతున్నందున ఆ ప్రభావంతో రేపు పిడుగులు పడే అవకాశముందని కూడా వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. రేపు గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది.
ఈరోజు మాత్రం...
అలాగే ఈరోజు కొన్ని చోట్ల వడగాలులు వీచే అవకాశముందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. అనకాపల్లి జిల్లా నర్సీప్నం, నాతవరం, కాకినాడ జిల్లాల్లోని కోటనందూరులో వడగాల్పులు వీచే అవకాశముందని పేర్కొంది. రేపు మాత్రం పిడుగులు పడే అవకాశమున్నందున పొలంలో పనిచేసే రైతులు, కూలీలు, పశువులు, గొర్రె కాపర్లు జాగ్రత్తగా ఉండాలని, చెట్ల కింద తలదాచుకోరాదని పేర్కొంది.