ఏపీకి రెయిన్ అలర్ట్

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

Update: 2022-07-12 03:51 GMT

ఆంధ్రప్రదేశ్ లో మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో అల్పపీడనం బలపడినందున అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని విపత్తుల సంస్థ ఎండీ డా బి.ఆర్ అంబేద్కర్ తెలిపారు. వాయువ్య బంగాళాఖాతంలో ఒడిశా తీరానికి ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని ఆయన తెలిపారు. ఈ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపారు.

ఈ జిల్లాల్లో...
ప్రధానంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం. పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, తూర్పుగోదావరి, కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఆయన తెలిపారు. రానున్న 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడే అవకాశమున్నందున భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Tags:    

Similar News