జనసేన పై బొత్స ఆగ్రహం

ఉత్తరాంధ్ర మీద అంత ద్వేషం ఎందుకు వెళ్లగక్కుతున్నారని మంత్రి బొత్ప సత్యనారాయణ ప్రశ్నించారు

Update: 2022-10-16 07:11 GMT

ఉత్తరాంధ్ర మీద అంత ద్వేషం ఎందుకు వెళ్లగక్కుతున్నారని మంత్రి బొత్ప సత్యనారాయణ ప్రశ్నించారు. విశాఖకు పరిపాలన రాజధాని రాకూడదని కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా విశాఖకు రాజధాని వచ్చి తీరుతుందని బొత్స తెలిపారు. కొన్ని పార్టీల వైఖరిని చూస్తుంటే బాధ కలుగుతుందన్నారు. అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా అభివృద్ధిని అడ్డుకుంటున్నారన్నారు. కావాలంటే ఇంటింటికి వెళ్లి వారి మనోభావాలను తెలుసుకోవాలని కోరారు. ఉత్తరాంధ్ర ప్రజలు బలంగా రాజధానిని కోరుకుంటున్నారని తెలిపారు. విశాఖకు వ్యతిరేకంగా ఆడే ఆటలు ఇక సాగవు అని ఆయన వార్నింగ్ ఇచ్చారు.

అది పార్టీకాదు...
పవన్ కల్యాణ్ టీడీపీకి వత్తాసు పలుకుతున్నారన్నారు. జనసేన ఒక పార్టీ కాదని, ఒక వ్యక్తి పెట్టుకున్న సంస్థ అని ఆయన అన్నారు. ఆ పార్టీకి ఒక విధానం లేదన్నారు. జ రాజకీయ పార్టీకి ఉన్న లక్షణం ఏదీ జనసేనకు లేదని బొత్స సత్యనారాయణ అన్నారు. వ్యక్తిత్వంలేని వారు మాత్రమే ఇలా వ్యవహరిస్తారన్నారు. విమానాశ్రయం వద్ద జరిగిన ఘటనలో పోలీసుల వైఫల్యం ఉందని, నిర్లక్ష్యం ఉందని తాము కాదనడం లేదన్నారు. అలా అని విశాఖ మీద కక్ష కట్టి వ్యవహరిస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. ఐదు లక్షల కోట్లు తీసుకెళ్లి ఆ గుట్టల్లో పోయాలని చెబుతున్నారన్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు బాగుపడుతుండటం చూసి సహించలేకపోతున్నారన్నారు. రైతుల పాదయాత్ర కాదని, టీడీపీ యాత్ర అని ఆయన అన్నారు. త్యాగం అనే పదం చులకన అయిపోయిందన్నారు.


Tags:    

Similar News