మంత్రి మేకపాటికి కరోనా పాజిటివ్

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది.న ఆయనకు జరిపిన వైద్య పరీక్ష్లల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది;

Update: 2022-01-22 12:56 GMT
mekapati gautam reddy, minister, coorona, positive
  • whatsapp icon

మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి కరోనా సోకింది.న ఆయనకు జరిపిన వైద్య పరీక్ష్లల్లో కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండటంతో మేకాపాటి గౌతమ్ రెడ్డి కరోనా పరీక్షలు చేయించుకోవడంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. వైద్యుల సలహా మేరకు ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నారు.

కోవిడ్ నిబంధనలను....
అయితే తన ఆరోగ్యపరిస్థితి మెరుగ్గానే ఉందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. గత కొద్ది రోజులుగా తనను కలసిన వారంతా ఖచ్చితంగా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలని ఆయన కోరారు. ప్రతి ఒక్కరూ కోవిడ్ ప్రొటోకాల్స్ ను పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మేకపాటి గౌతమ్ రెడ్డి కోరారు.


Tags:    

Similar News