మరి ఇది ఏ సైడ్ లవ్వో?

చంద్రబాబు, లోకేష్ లకు ప్రతిదీ రాజీకీయం చేయడం అలవాటుగా మారిందని మంత్రి పేర్ని నాని మండి పడ్డారు.

Update: 2022-02-25 12:54 GMT

విజయవాడ : పవన్ కల్యాణ‌్ సినిమాను తాము ఎందుకు తొక్కేస్తామని మంత్రి పేర్ని నాని ప్రశ్నించారు. సినిమా టిక్కెట్ల ధరలపై ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పారు. ధరలపై కమిటీ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. అలాంటప్పుడు భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేసుకుని ఉండాల్సిందన్నారు. టిక్కెట్ల రేట్లపై నిర్ణయం తీసుకున్న తర్వాత రిలీజ్ చేసి ఉంటే ఎలాంటి ఇబ్బందులు ఉండేవి కావని పేర్ని నాని అభిప్రాయపడ్డారు.

పవన్ ను మేం తొక్కడం ఏంటి?
పవన్ కల్యాణ్ ను తాము తొక్కడం లేదని, ఎన్టీఆర్, హరికృష్ణలను తొక్కింది తెలుగుదేశం పార్టీయే నని పేర్ని నాని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ లకు ప్రతిదీ రాజీకీయం చేయడం అలవాటుగా మారిందన్నారు. తండ్రీకొడుకులు చివరకు సినిమాలను కూడా రాజకీయం చేస్తున్నారని పేర్ని నాని ఫైర్ అయ్యారు. టీడీపీ జెండాను మోసిన జూనియర్ ఎన్టీఆర్ ను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కుప్పం సభలో వన్ సైడ్ లవ్ ఉండదని చంద్రబాబు చెప్పారని, మరీ ఇది ఏ సైడ్ లవ్వో చెప్పాలని పేర్ని నాని నిలదీశారు.


Tags:    

Similar News