బాలయ్యకు మంత్రి రోజా కౌంటర్
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వివాదం ఇంకా ఏపీలో కొనసాగుతూనే ఉంది. అధికార, విపక్ష పార్టీలకు మధ్య మాటల మధ్య డైలాగుల వార్ ముదురుతుంది. సినీ నటుడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై వరసగా మంత్రులు రియాక్ట్ అవుతున్నారు. మంత్రి నారాయణ స్వామి కూడా స్పందించారు. నాడు ఎన్టీఆర్ పై చెప్పులు వేసినప్పుడు బాలయ్య ఏం చేశారని ప్రశ్నించారు. మందుకొట్టి పడుకున్నావా? అని నిలదీశారు.
ఫ్లూటు బాబు ముందు...
అలాగే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు మంత్రి ఆర్కే రోజా స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. "బాలయ్య ఫ్లూటు బాబు ముందు ఊదు. జగన్ ముందు కాదు. అక్కడ ఉంది రీల్ సింహం కాదు. జగన్ అనే రియల్ సింహం" అంటూ ఆర్కే రోజా ట్వీట్ చేశారు. రెండు రోజలు క్రితం బాలకృష్ణ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పుపై స్పందించారు. దీనికి వరసగా మంత్రులు సమాధానమిస్తున్నారు.