బాలకృష్ణకు రోజా కౌంటర్

నందమూరి బాలకృష్ణ పై మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు. జీవో నెంబరు 1 గురించి పూర్తిగాచదివితే అర్థమవుతుందన్నారు.

Update: 2023-01-15 08:01 GMT

నందమూరి బాలకృష్ణ పై మంత్రి ఆర్కే రోజా మండి పడ్డారు. జీవో నెంబరు 1 గురించి పూర్తిగాచదివితే అర్థమవుతుందన్నారు. ఆయన ఎమెర్జెన్సీ అనడం సిగ్గుచేటు అని అన్నారు. చంద్రబాబు భ్రమ నుంచి బాలకృష్ణ బయటకు రావాలని రోజా పిలుపునిచ్చారు. ఇచ్చిన స్క్రిప్ట్ చదవడం తప్ప జీవోలు చదవడం రాదా? అని ప్రశ్నించారు.

ఎమెర్జెన్సీ పదాన్ని...
జీవో నెంబరు 1 ఎందుకు తెచ్చారో తెలుసుకున్నారా? అని నిలదీశారు. బాలకృష్ణ రెండుసార్లు గెలిచిన ఎమ్మెల్యేగా ప్రజల బాగోగులు తెలిసిన వ్యక్తి అని, ఆ జీవో నెంబరు ఎందుకు తెచ్చామో తెలుసుకుంటే ఎమెర్జెన్సీ అనే కామెంట్స్ వెనక్కు తీసుకుంటారని రోజా అన్నారు. సినిమాలో ఎన్ని డైలాగులు కొట్టినా చప్పట్లు కొట్టడానికే పనికొస్తాయని అన్నారు.


Tags:    

Similar News