అసలే తిరుమలలో రద్దీ.. ఏపీ మంత్రి హంగామా చూశారా?
తిరుమలలో శ్రీవారిని మంత్రి ఉషా శ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఆమెతో పాటు 50 మంది అనుచరులు కూడా దైవదర్శనానికి వచ్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వరస సెలవులు రావడంతో భక్తులు తిరుమల పర్యటనన వాయిదా వేసుకోవాలని టీటీడీ కోరుతుంది. కానీ మంత్రులు మాత్రం ఇది పట్టించుకోవడం లేదు. తిరుమలలో శ్రీవారిని మంత్రి ఉషా శ్రీ చరణ్ దర్శించుకున్నారు. ఆమెతో పాటు 50 మంది అనుచరులు కూడా దైవదర్శనానికి వచ్చారు. మరో పది మందికి సుప్రభాత టిక్కెట్లను కేటాయించేలా ఆమె టీటీడీ అధికారులపై వత్తిడి తీసుకు వచ్చారు. రోజుల తరబడి తాము క్యూలైన్లలో నిల్చుంటే అనుచరులను తీసుకొచ్చి ఇలా ఎలా చేస్తారని కొందరు భక్తులు ప్రశ్నించారు.
గన్ మెన్ల దాడితో...
పదుల సంఖ్యలో అనుచరులతో వెళుతున్న మంత్రి ఉషా శ్రీచరణ్ ను కొందరు భక్తులు నిలదీయగా వారిపై మంత్రి గన్ మెన్లు దాడి చేశారు. అడ్డువచ్చిన మీడియా జర్నలిస్టులను కూడా వెనక్కు నెట్టారు. మంత్రి గన్ మెన్లు, ఆమె వైఖరిపై భక్తులు ఆందోళనకు దిగారు. శ్రీవారి దర్శనానికి 30 గంటల సమయం పడుతుంది. దీంతో భక్తులు అసహనంతో ఉన్నారు. కానీ మంత్రి మాత్రం తన అనుచరులను పదుల సంఖ్యలో తీసుకెళ్లి దర్శనం చేయించడం వివాదాస్పదంగా మారింది.