Andhra Pradesh : నేడు ఎనిమిదో రోజు ఏపీ అసెంబ్లీలో?

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కూడా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.

Update: 2024-11-20 02:32 GMT

ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నేడు ఎనిమిదో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు కూడా పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది.ప్రజాపద్దులు, అంచనాల కమిటీలకు సభ్యుల ఎన్నికపై తీర్మానాన్ని సమావేశాల్లో చేయనున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ(పీయూసీ)లకు సభ్యుల ఎన్నికపై తీర్మానం చేయనున్నారు. శాసనసభలో తీర్మానం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రవేశపెట్టనున్నారు. ఈ కమిటీల్లో 9 మంది చొప్పున ఎమ్మెల్యేలను శాసనసభ ఎన్నుకోనుంది.

పలు అంశాలపై చర్చ...
ఈ ఎన్నికకు సంబంధించిన షెడ్యూల్ ను స్పీకర్ వెల్లడించనున్నారు. సభలో ప్రతిపక్షం లేకపోవడంతో పీఏసీ ఛైర్మన్ ఎవరికీ దక్కుతుందనే దానిపై చర్చ జరుగుతుంది. తొలుత మాజీ ఎమ్మెల్యే నారా రామ్మూర్తినాయుడి మృతిపై సభ సంతాపం తెలపనుంది. కూటమి ప్రభుత్వంలో తొలి 150 రోజుల్లో అభివృద్ధి, సంక్షేమం అమలు అంశంపై చర్చ నేడు చర్చ జరగనుంది. రుషికొండ ప్యాలెస్ అక్రమ నిర్మాణాలపై అసెంబ్లీలో లఘు చర్చ జరుగుతుంది. నూతన ఎక్సైజ్ విధానంపై మంత్రి కొల్లు రవీంద్ర సభలో ప్రకటన చేయనున్నారు. అలాగే ద్రవ్య వినిమయ బిల్లు-2024ని మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టనున్నారు. పెండింగ్ లోని 3 ఎక్సైజ్, మున్సిపల్ శాఖ చట్టసవరణ బిల్లులకు అసెంబ్లీ ఆమోదం తెలపనుంది.


Tags:    

Similar News