శాసనసభకు బాబు శాశ్వతంగా దూరమే
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు
తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అనవసర రాద్ధాంతం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శాసనసభలో ప్రజా సమస్యలపై చర్చించలేదని, ఇప్పుడు అవకాశమున్నా టీడీపీ ఎమ్మెల్యేలు కావాలని అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ సభకు పదే పదే అంతరాయం కల్గిస్తే సస్పెండ్ చేయరా? అని అంబటి రాంబాబు ప్రశ్నించారు.
బాబు వెనక ఉండి...
చంద్రబాబు వెనక ఉండి టీడీపీ ఎమ్మెల్యేలను ఉసిగొల్పి సభకు పంపుతున్నారన్నారు. తాను ముఖ్యమంత్రి అయిన తర్వాతనే సభలోకి అడుగు పెడతానని శపథం చేసి వెళ్లిన చంద్రబాబు ఇక శాశ్వతంగా శాసనసభకు దూరమయినట్లేనని అంబటి రాంబాబు అన్నారు. కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటుందని, ఇందుకోసం ఎస్ఈబీని కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు. చివరకు గవర్నర్ ను కూడా టీడీపీ సభ్యులు అవమానపర్చారని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.