నేటి సాయంత్రానికి ఏపీకి నైరుతి రుతు పవనాలు
నేడు ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి.
నేడు ఏపీలోకి రుతుపవనాలు ప్రవేశిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. ఈరోజు కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. నేటి సాయంత్రానికి ఏపీకి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తాయి అక్కడ డక్కడ ఈదరు గాలులు వీచే అవకాశముందని పేర్కొంది.
ఎండ వేడిమితో.....
గత కొన్నిరోజులుగా ఎండ వేడిమితో అల్లాడుతున్న ప్రజలకు ఈరోజు చల్లని కబురు అందనుంది. నేటి నుంచి ఏపీ వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చేసిన సూచనతో ఆనందం వెల్లివెరివిస్తోంది. గత రెండు నెలలుగా ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. బయటకు రావాలన్నా భయపడే పరిస్థితి. అయితే నేటి సాయంత్రానికి నైరుతి రుతుపవనాలు ప్రవేశిస్తుండటంతో వాతావరణం చల్లబడనుంది.