నాకు సమాచారం లేదు.. టిక్కెట్ కేటాయించలేదు

ఉండి టిక్కెట్ తనకు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు

Update: 2024-04-07 04:01 GMT

ఉండి టిక్కెట్ తనకు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని నరసాపురం పార్లమెంటు సభ్యుడు రఘురామ కృష్ణరాజు తెలిపారు. తనకు ఇంత వరకూ అలాంటి సమాచారం లేదన్నారు. అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుకు కూడా ఎలాంటి సమాచారం లేదని ఆయన తెలిపారు. అభ్యర్థిని మార్చదలచుకుంటే ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజును పిలిచి మాట్లాడతారని, కేవలం ఊహాగానాలను నమ్మవద్దని రఘురామ కృష్ణరాజు కోరారు. తనకు కూడా ఈ సీటు పై ఎటువంటి సమాచారం లేదన్నారు.

వచ్చే ఎన్నికల్లో...
అయితే తాను ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా పోటీ చేస్తానని మాత్రం ఆయన తెలిపారు. ఎక్కడి నుంచి అన్నది ఇంకా తేలలేదన్నారు. రఘురామ కృష్ణరాజు టీడీపీలో చేరడంతో ఆయనకు ఉండి టిక్కెట్ ఇచ్చారన్న ప్రచారం జరగడంతో రామరాజు వర్గీయులు మండిపడుతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తనను కాదని, తనకు చెప్పకుండా ఆయనను ఎలా ప్రకటిస్తారని రామరాజు ప్రశ్నిస్తన్నారు. దీనికి రఘురామ రాజు వివరణ ఇచ్చారు. నరసాపురం పార్లమెంటు అభ్యర్థిని మార్చాలన్న ప్రతిపాదనను బీజేపీ వద్దకు టీడీపీ పంపినట్లు తెలిసింది. మొత్తం మీద ఇంత వరకూ ఉండి టిక్కెట్ రఘురామ కృష్ణరాజు కు కేటాయించినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు.


Tags:    

Similar News