పాపికొండల విహారయాత్ర నిలిపివేత
తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు గోదావరి నదిలో నీటి ఉధృతి పెరగడంతో పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది.
ఆంధ్రప్రదేశ్ లో తుఫాను హెచ్చరిక జారీ చేయడంతో పాటు గోదావరి నదిలో నీటి ఉధృతి పెరగడంతో పాపికొండల విహారయాత్రకు బ్రేక్ పడింది. వాతావరణ శాఖ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పాపికొండల విహారయాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. నాలుగు రోజుల పాటు యాత్రను నిలిపివేస్తున్నామని అధికారులు తెలిపారు.
పునరుద్ధరణపై...
తుఫాను విషయంపై పూర్తి క్లారిటీ వచ్చిన తర్వాత పరిస్థితులను బట్టి పాపికొండల విహార యాత్రను పునరుద్ధరించాలా? లేదా? అన్న దానిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఈ సమయంలో గోదావరిలో ప్రయాణం ప్రమాదకరమని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అనుమతిలేకుండా ఎవరైనా తీసుకెళితే చర్యలు తప్పవని హెచ్చరించారు.