Andhra Pradesh : తెలుగు తమ్ముళ్లకు త్వరలో గుడ్ న్యూస్.. రెండో జాబితా రెడీ

తెలుగుదేశం పార్టీ నేతలకు త్వరలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పనున్నారు

Update: 2024-11-08 04:11 GMT

telugu desam party leaders

తెలుగుదేశం పార్టీ నేతలకు త్వరలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. వారం రోజుల్లో నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయనున్నారు. అందిన సమాచారం మేరకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న సమయంలోనే నామినేటెడ్ పోస్టుల రెండో జాబితాను ఆయన ప్రకటించే అవకాశం ఉందని తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల భర్తీపై చంద్రబాబు కసరత్తు ఒక కొలిక్కి వచ్చింది. ఇప్పటికే తొలి జాబితాను ప్రకటించిన చంద్రబాబు తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నియామకం చేపట్టారు. తొలి జాబితాలో మిత్రపక్షాలైన జనసేన, బీజేపీలకు కూడా అవకాశం కల్పించారు.

పదవులను పంచిపెట్టేందుకు...
ఇక రెండో జాబితాలోనూ అదే ఫార్ములాలో పదవులు పందేరం చేసే యోచనలో చంద్రబాబు ఉన్నారు. ఈ మేరకు ఆయన కసరత్తు పూర్తి చేశారు. రెండోజాబితాపై పవన్ కల్యాణ్ తో మాట్లాడి ఆయన పార్టీ నుంచి ఎవరెవరికి పదవులు ఇవ్వాలో పేర్లు అడిగి తీసుకున్నారని తెలిసింది. అలాగే బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంద్రీశ్వరితో కూడా మాట్లాడి బీజేపీ నేతల పేర్లను కూడా తీసుకోనున్నారని తెలిసింది. మొదటి జాబితా రేషియో తరహాలోనే రెండో జాబితాలో కూడా అధిక శాతం పదవులు టీడీపీ, తర్వాత జనసేనకు, ఆ తర్వాత బీజేపీకి ఇచ్చే విధంగా చంద్రబాబు ఒక ప్రత్యేక ఫార్ములాను సిద్ధం చేసుకున్నట్లు తెలిపారు.
వీరికే అధిక ప్రాధాన్యం...
రెండో జాబితాలో బీసీల నుంచి ఎక్కువ మంది నేతలు ఉండేలా చంద్రబాబు జాగ్రత్తలు తీసుకుంటున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారంలో ఏపీ లో నామినేటెడ్‌ భర్తీకిరెండో జాబితాలో భారీగా పందేరం చేస్తున్నారన్న సమాచారం అందడంతో నేతలందరూ ముఖ్య మైన లీడర్ల వద్దకు పదవుల కోసం క్యూ కట్టారు. ఇందులో 30-35 కులాల కార్పొరేషన్లుకొన్ని ఇతర కార్పొరేషన్లకూ నియామకాలు జరపునున్నారని తెలిసింది. జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీలకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో 56 బీసీ కార్పొరేషన్లు ఉన్నాయి. ఈ కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు ఒక్కో కార్పొరేషన్‌కు 12మంది సభ్యులను నియమించుకునే అవకాశముంది. దీంతో చంద్రబాబు భారీ కసరత్తుచేస్తున్నారు. దాదాపుగా రెండో జాబితా పూర్తి కావడంతో బహుశ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యే కంటే ముందుగానే ప్రకటించే ఛాన్స్ ఉందంటున్నారు.


Tags:    

Similar News