Andhra Pradesh : ఏపీలో ఒకరోజు ముందుగానే పింఛన్ల పంపిణీ ప్రారంభం
ఆంధ్రప్రదేశ్ లో నేటి ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది
ఆంధ్రప్రదేశ్ లో నేటి ఉదయం నుంచే పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది. సెప్టెంబరు1వతేదీన పింఛన్లు పంపిణీ చేయాల్సి ఉండగా అయితే ఆరోజు ఆదివారం కావడంతో ఒక రోజు ముందుగానే పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకే నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమయింది.
ఎప్పటి మాదిరిగానే...
రాష్ట్రంలో ఉన్న సుమారు 65 లక్షల మంది పింఛను దారులకు పింఛనును నేడు పంపిణీ చేయాలని ప్రభుత్వం సిబ్బందిని ఆదేశించింది. ఎప్పటి మాదిరిగానే సచివాలయ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది ఇళ్లకు వెళ్లి పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. ఈరోజు అందని వారికి పింఛను సోమవారం అందుతుందని ప్రభుత్వం ముందుగానే ప్రకటించింది.