వణికిపోతున్న విశాఖ మన్యం

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం 11 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి ఉంది.;

Update: 2022-02-01 03:06 GMT
cold waves, adilabad, telangana
  • whatsapp icon

చలిగాలుల తీవ్రత ఏజెన్సీ ప్రాంతాల్లో ఎక్కువగా కన్పిస్తుంది. మంచు ఉదయం పదకొండు గంటల వరకూ వీడటం లేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని విశాఖ మన్యంలో ప్రజలు చలికి వణికిపోతున్నారు. ఉదయం 11 గంటల వరకూ బయటకు రాలేని పరిస్థితి ఉంది. ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోవడంతో ప్రజలు జలుబు, దగ్గు, జ్వరం వంటి వ్యాధులతో బాధపడుతున్నారు.

అత్యల్ప ఉష్ణోగ్రతలు....
విశాఖ మన్యంలోని జి.మాడుగులలో 2.7 శాతం, చింతపల్లిలో 3.5, అరకులోయలో 3.9, పెద్దబయలులో 5.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. చలిగాలుల తీవ్రత మరో రెండు రోజులు ఎక్కువగా ఉంటుందని ప్రజలు అన్ని రకాల జాగ్రత్తలు పాటించాలని వాతావరణ శాఖ సూచిస్తుంది.


Tags:    

Similar News