వంశీ రిమాండ్ గడువు పొడిగింపు
గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది;

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రిమాండ్ ను న్యాయస్థానం పొడిగించింది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో ఆయన రిమాండ్ ను పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏప్రిల్ 9వ తేదీ వరకూ రిమాండ్ విధిస్తున్నట్లు పేర్కొంది. న్యాయస్థానం రిమాండ్ పొడిగించడంతో ఆయన బెయిల్ పిటీషన్ ను కూడా డిస్మిస్ కావడంతో ఇక విజయవాడ జైల్లోనే ఉండాల్సిన పరిస్థితులున్నాయి.
జిల్లా జైలులో...
వల్లభనేని వంశీ సత్యవర్థన్ కిడ్నాప్ కేసులో అరెస్టయి జైల్లో ఉన్నారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై అనేక కేసులు నమోదవుతుండటంతో వరస కేసుల్లో ఆయనకు బెయిల్ దక్కే అవకాశాలు ఇప్పట్లో కనిపించే ఛాన్స్ లేదని న్యాయనిపుణులు చెబుతున్నారు. మైనింగ్, ఇసుక తవ్వకాల వంటి అక్రమాల విషయాలపై కూడా వల్లభనేని వంశీపై కేసు నమోదయింది.