YSRCP : వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా

వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. జయమంగళ వెంకట రమణ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు;

Update: 2024-11-23 08:29 GMT
avanti srinivas, ex  minister, ycp, resign
  • whatsapp icon

వైసీపీకి మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. జయమంగళ వెంకట రమణ వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. కైకలూరుకు చెందిన జయ మంగళ వెంకటరమణను గత ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలో చేర్చుకున్నారు. జగన్ ఆయనకు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. అయితే తాజాగా ఆయన తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఎమ్మెల్సీపదవికి కూడా...
ఎమ్మెల్సీ పదవితో పాటు వైసీపీకి కూడా తాను రాజీనామ చేస్తున్నట్లు జయమంగళ వెంకటరమణ ప్రకటించారు. తన రాజీనామా లేఖను శాసనమండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు పంపినట్లు ఆయన వెల్లడించారు. దీంతో మరో ఎమ్మెల్సీ పదవి ఇప్పుడు కూటమి ఖాతాలో పడే అవకాశముంది. అయితే శాసనమండలి ఛైర్మన్ ఆయన రాజీనామాను ఆమోదించాల్సి ఉంది.


Tags:    

Similar News