మైలవరంలో పోస్టర్ల కలకలం
మైలవరం నియోజకవర్గంలో పోస్టర్ల కలకం రేపుతుంది. అన్ని పార్టీలూ ఇక్కడ టిక్కెట్లను స్థానికులకే ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి
మైలవరం నియోజకవర్గంలో పోస్టర్ల కలకం రేపుతుంది. అన్ని పార్టీలూ ఇక్కడ టిక్కెట్లను స్థానికులకే ఇవ్వాలంటూ పోస్టర్లు వెలిశాయి. స్థానికేతరులకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ పోస్టర్లలో పేర్కొన్నారు. ఇందుకు ఐదు కారణాలను వారు అందులో చెప్పారు. స్థానికుడైతేనే తమ సమస్యలను సత్వరం పరిష్కరిస్తారని వారు పేర్కొన్నారు. స్థానికేతరులు కావడంతో ఇక్కడ నివాసముండకుండా తమను పట్టించుకోవడం లేదని పోస్టర్లలో ఆరోపించారు. స్థానికుడినే ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పోస్టర్ లో పేర్కొన్నారు.
ఇద్దరూ స్థానికేతరులే...
ఇటు వైసీపీ, అటు టీడీపీ ఇద్దరూ స్థానికేతరులనే గత ఎన్నికల్లో అభ్యర్థులుగా ప్రకటించింది. టీడీపీ అభ్యర్థి దేవినేని ఉమామహేశ్వరరావు, వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ లు నందిగామకు చెందిన వారు. నందిగామ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో రెండు కుటుంబాలు మైలవరానికి షిఫ్ట్్ అయ్యాయి. అయితే ఈసారి మాత్రం స్థానికేతరులకే అన్ని పార్టీలూ టిక్కెట్లు ఇవ్వాలంటూ డిమాండ్ చేస్తున్నాయి.