కాకినాడలో కేఏ పాల్ కు అవమానం

కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు అవమానం జరిగింది.

Update: 2022-07-28 06:45 GMT

కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కు అవమానం జరిగింది. కాకినాడకు వచ్చిన కేఏ పాల్ కాన్వాయ్ లో ఉన్న కార్లను స్వాధీనం చేసుకున్నారు. ఫైనాన్షియర్లు కేఏ పాల్ కాన్వాయ్ లో ఉన్న రెండు వాహనాలను స్వాధీనం చేసుకుని సీబీఎం కళాశాల గ్రౌండ్ కు తరలించారు. పాస్టర్ రత్నకుమార్ కు, కేఏ పాల్ కు మధ్య ఆర్థిక లావాదేవాలున్నాయి. తనకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకుండా పాల్ తప్పించుకుంటున్నారని రత్నకుమార్ ఆరోపిస్తున్నారు. డబ్బులు అడిగితే తనను బెదిరించారని రత్నకుమార్ ఆరోపిస్తున్నారు. కేఏ పాల్ తన కాన్వాయ్ లోకి ఆరు కొత్త వాహనాలను కొనుగోలు చేశారు.

డబ్బులు ఇవ్వకపోవడంతో...
ఈ కొనుగోలు చేసిన కార్లకు పాల్ డబ్బులు చెల్లించకపోవడంతో కాన్వాయ్ లోని రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. మరో వైపు పవన్ కల్యాణ్ పై కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా జనసేన నేతలు కూడా ఈ వాహనాలను సీబీఎం కళాశాలలోకి తరలించారని అంటున్నారు. మొత్తం మీద కేఏ పాల్ కాకినాడ పర్యటనలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేఏ పాల్ బౌన్సర్లు కార్లను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరు వర్గాలను శాంతింప చేశారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


Tags:    

Similar News